Pakistan: పాకిస్తాన్‌‌‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..

Karachi

Karachi

Pakistan: ఇరాన్‌లో ఖమేనీ మరణం మంటలు పాకిస్తాన్‌కు వ్యాపించాయి. పాకిస్తాన్‌లో కరాచీ, లాహోర్‌లో ఇజ్రాయిల్, అమెరికాకు వ్యతిరేకంగా ప్రజలు హింసాత్మక నిరసనలకు పాల్పడుతున్నారు. కరాచీలోని యూఎస్ ఎంబపీపై దాడులకు తెగబడ్డారు. రాయబార కార్యాలయాన్ని తగలపెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రం కావడంతో యూఎస్ కాన్సులేట్‌లోని అమెరికా సైనిక సిబ్బంది అల్లరి మూకపై కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. కరాచీలోని ఎంటీ ఖాన్ రోడ్‌లోని అమెరికా కాన్సులేట్ వెలుపల పెద్ద సంఖ్యలో నిరసనకారులు గుమిగూడడంతో ఈ సంఘటన ప్రారంభమైంది. ఇరాన్‌లో ఆయతుల్లా ఖమేనీ,అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Also: PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!

నిరసనకారులు ఎంబసీ కాంపౌండ్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి పాక్ పోలీసులు, అమెరిక భద్రతా దళాలు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మరణించగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈఘటనపై సింధ్ హోం మినిస్టర్ జియవుల్ హసన్ లంజార్ వెంటనే కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (AIG) ఆజాద్ ఖాన్‌ను పరిస్థితిపై వివరణ కోరినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. శాంతికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కరాచీ పోలీసులు హెచ్చరించారు.