Karachi UK Office: ఓ వీసా కార్యాలయంలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. వెయిటింగ్ హాల్లో అమర్చిన టీవీలో పోర్న్ వీడియో దర్శనం ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంత షాక్‌కు గురైన సంఘటన పాకిస్తాన్ కరాచీలోని యూకే వీసా ఆఫీసులో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో గెర్రీ విసా సెంటర్‌కు జనం క్యూ కట్టారు. వీసా ఇంటర్య్వూకి హాజరైన అభ్యర్థులు అక్కడ వెయిటింగ్ హాల్లో క్యూలు కట్టారు. అక్కడ అమర్చిన టీవీలో అడల్ట్ కంటెంట్ వీడియో రావడంతో అక్కడే దూరంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానికి జూమ్ చేసి చూడగానూహ్యం అసభ్యకరమైన వీడియో ప్లే అవ్వడం కనిపించింది.
Also Read: Nithin: మెగా హీరోలు కాకుండా వరుణ్ పెళ్ళికి నితిన్ ఒక్కడే ఎందుకు వెళ్ళాడో తెలుసా?
దీనిని అతడు ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీసా ఆఫీసులో పోర్న్ వీడియో రావడంతో అక్కడ ఉన్న వారంత ఖంగుతిన్నారు. ఇదేంటని కొందరు అక్కడ ఉన్న అధికారులు ప్రశ్నించడంతో వారు అలర్ట్ అయ్యారు. వెంటనే టీవీ స్వీఛ్చాఫ్ చేయించారు. కాగా ఇలా పబ్లిక్ ప్లేస్ పోర్న్ వీడియో ప్లే అవ్వడంపై అంతా షాక్ అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని, అయినా ఆఫీసు టీవీల్లో ఇలాంటి వీడియో రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా పబ్లిక్ ఏరియాలోని టీవీల్లో ఇలాంటి వీడియో రావడం ఇది ఫస్ట్ టైం కాదు. రీసెంట్‌గా ఇండియాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. గత మార్చిలో బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లోని టీవీలో ఇలాంటి ఘటనే జరిగింది. రైలు షెడ్యూల్‌ను ప్రకటించడానికి ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టెలివిజన్‌లో అడల్ట్ వీడియో ప్లే అయ్యింది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్ అయ్యింది.
Also Read: Uttarakhand Tunnel Operation: ఇంకా 2 మీటర్ల దూరమే.. రాత్రంతా కొనసాగనున్న డిగ్గింగ్ పనులు?