NTV Telugu Site icon

US Election: ముందంజలో దూసుకెళ్తోన్న కమలాహారిస్.. తాజా సర్వేలో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..!

Uselection

Uselection

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలాహారిస్ దూసుకెళ్లిపోతున్నారు. తాజా సర్వేలో ఆమె ముందంజలో ఉన్నారు. డెమొక్రాట్‌ అభ్యర్థిగా కమలాహారిస్.. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ బరిలో ఉన్నారు. నవంబర్‌లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన సర్వేలో ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 3 రోజుల పాటు నిర్వహించిన సర్వే సెప్టెంబర్‌23తో ముగిసింది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 40.48శాతం అనుకూలంగా ఓట్లు రాగా.. కమలకు 46.61 శాతం అనుకూల ఓట్లు వచ్చాయి. సెప్టెంబర్‌ తొలి వారంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే కమల ఒక శాతం ఎక్కువ ఓట్లు సాధించింది. నవంబర్‌5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరు జరగనుంది.

ఇది కూడా చదవండి: IPS Transfers: ఏపీలో16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

తొలుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు. అయితే ఆరోగ్య రీత్యా దేహం సహకరించకపోవడంతో ఆయన స్థానంలో కమలా హారిస్‌ను డెమోక్రాట్ పార్టీ రంగంలోకి దింపింది. ఈమెతో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఓడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్ హత్యాయత్నం జరిగింది. దీంతో ఆయనపై సానుభూతి పెరిగింది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Bengaluru Murder Case: మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం.. 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..