NTV Telugu Site icon

Joe Biden: అమెరికాలో కలకలం.. బైడెన్‌ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు

Joe Biden

Joe Biden

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్యాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లోని వైట్ హౌజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వైట్ హౌజ్ ముందు ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. తన కారుతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Congress: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులు వీరే..

ఈ సంఘటనతో ప్రపంచమంతా అగ్రరాజ్యం అమెరికా భద్రతా వైఫల్యంపైనే చర్చించుకుంటోంది. వైట్‌హౌజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బైడెన్‌ దంపతులు ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నిందితుడు అటూగా అతివేగంగా దూసుకువచ్చి దూసుకువచ్చి యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Ap Jobs 2023 : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 70 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. వివరాలివే..

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్‌ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్‌ దంపతులను వెంటనే వైట్‌హౌస్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments