హమాస్ స్వాధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలు హతమయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యప్తంగా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Crime: ఉద్యోగం లేదన్న డిప్రెషన్‌తో మేనకోడలిని గొంతు కోసి హత్య చేసిన మామ..
అలాగే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీరుపై విరుచుకుపడ్డారు. నెతన్యాహు తీరు కారణంగానే ఇలా జరిగిందంటూ బైడెన్ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయటం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Damodar Raja Narsimha: సీజనల్ వ్యాధుల కట్టడిపై వైద్యారోగ్య శాఖ చర్యలు