NTV Telugu Site icon

George Soros: జార్జ్ సోరోస్‌కి యూఎస్ అత్యున్నత పురస్కారం.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..

George Soros

George Soros

George Soros: బిలియనీర్ జార్జ్ సోరోస్‌ని ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’తో గౌరవించాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్ బహిరంగంగా విమర్శించారు. ‘‘బైడెన్ సోరోస్‌కి ప్రెసిడెన్షియల్ మెడల్‌ని ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఒక విడ్డూరం’’ అని మస్క్ విమర్శించారు.

బైడెన్ శనివారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డులను ప్రకటించారు. , రాజకీయాలు, దాతృత్వం, క్రీడలు మరియు కళలకు సంబంధించిన 19 మంది వ్యక్తులకు ఈ అవార్డుల్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పద వ్యక్తిగా ఉన్న జార్జ్ సోరోస్‌కి కూడా అవార్డు ఇవ్వడం గమనార్హం. సోరోస్ బిలియనీర్, సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. వైట్‌హౌజ్ ప్రకటన ప్రకారం.. ప్రజాస్వామ్యం, మానవహక్కులు, విద్య, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే ప్రపంచ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాడరని జార్జ్ సోరోస్ గురించి పేర్కొంది.

Read Also: AP Crime: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గర్భవతైన మైనర్ బాలిక!

జార్జ్ సోరోస్‌తో పాటు మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, నటులు మైఖేల్ J ఫాక్స్, డెంజెల్ వాషింగ్టన్ ఉన్నారు. జార్జ్ సోరోస్ తన డబ్బులో ప్రపంచంలో ప్రభుత్వాలను పడగొట్టే, రెజిమ్ చేంజ్ ఆపరేషన్లు నిర్వహిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇతను జోబైడెన్ పార్టీ అయిన డెమొక్రట్ పార్టీకి కీలక దాతగా ఉన్నాడు. పలు సందర్భాల్లో రిపబ్లికన్ పార్టీ.. సోరోస్ తన సంపదను ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నాడని ఆరోపిస్తోంది.

ఇటీవల, భారతదేశంలో కూడా జార్జ్ సోరోస్ అంశం రాజకీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నా్యని బీజేపీ ఆరోపించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోరోస్ అంశం ప్రధానంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరియు సోరోస్ నిధులతో కూడిన కార్యక్రమాల మధ్య సంబంధాలను ప్రస్తావిస్తూ.. భారతదేశాన్ని అస్థిరపరిచే శక్తులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది.

Show comments