Site icon NTV Telugu

US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్‌కు జేడీ వాన్స్ వార్నింగ్..

Jdvancr

Jdvancr

US: యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ బయలుదేరారు. ఆయన ఇస్లామాబాద్ వెళ్లే ముందు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలపై తాము ఆశాభావంతో ఉన్నామని, సజావుగా సాగుతాయని నమ్ముతున్నారని చెప్పారు. ఇరాన్ నిజంగా నిజాయతీగా చర్చలను కోరుకుంటే, అమెరికా కూడా వారితో మంచి చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు.

Read Also: Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

అయితే, ఇదే క్రమంలో ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికాతో ఆట ఆడాలని చూస్తే, చర్చల్లో మోసం, కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా తీవ్రంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. శనివారం చర్చలు మొదలుకానున్నాయి. పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం మరియు ఇరాన్‌కు పొరుగు దేశం. పాకిస్తాన్‌కు అమెరికాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో మధ్యవర్తిత్వానికి పాక్ కేంద్రంగా మారింది.

Exit mobile version