Site icon NTV Telugu

JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన

Jdvance

Jdvance

భార్య మతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేషాలు వ్యక్తమవ్వడంతో తాజాగా జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య హిందువు అని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని చెప్పారు. తన పిల్లలు మాత్రం క్రైస్తవులుగా పెరుగుతున్నారని.. ఆమె కూడా ఏదొక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తానని.. ఆమెకు అండగా ఉంటానన్నారు. ఉష తన భార్య అయినందున అన్ని విషయాలు ఆమెతో మాట్లాడతానని జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు.

మిస్సిస్సిప్పి రాష్ట్రంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్-ఎరికా కిర్క్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉష హిందువు అని.. ఏదొక రోజు క్రైస్తవ్యంలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక.. ఇప్పుడు ఇవేం వ్యాఖ్యలు అంటూ భారతీయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్యకు క్రైస్తవ్యంలోకి మారే ఉద్దేశం లేదని చెప్పారు.

ఇదిలా ఉంటే ఈవెంట్‌లో ఎరికా కిర్క్‌ను గట్టిగా జేడీ వాన్స్ కౌగిలించుకున్నారు. చాలా దగ్గరగా సంబంధం పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిందువు భార్య కారణంగా అమెరికన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న నేపథ్యంలో ఎరికా కిర్క్‌ను వివాహం చేసుకోవచ్చన్న చర్చ కూడా విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె

Exit mobile version