Site icon NTV Telugu

Viral News: రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ‘కుక్క’గా మారిన మనిషి

Dog Dress Min

Dog Dress Min

మనిషి అన్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే కొందరికి విచిత్రమైన కోరికలు కలుగుతాయి. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ వ్యక్తికి కూడా వింత కోరిక కలిగింది. తాను నాలుగు కాళ్ల జంతువుగా మారిపోవాలన్న ఆశ పుట్టింది. దీంతో తనకు కుక్క రూపమైతే సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. తన ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు. జపాన్‌లో జెప్పెట్ సంస్థ పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్, మస్కట్ పాత్రలకు సంబంధించి దుస్తులను సరఫరా చేస్తుంటుంది.

Cycles Museum: ఆ ఇంట్లో అన్నీ సైకిళ్ళే… అదో మ్యూజియం

ఈ నేపథ్యంలో టోకో అనే వ్యక్తి కూడా తనకు కుక్క లాంటి కాస్ట్యూమ్స్ కావాలని జెప్పెట్ సంస్థను కోరాడు. దీంతో సుమారు రెండు మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీలో రూ.12 లక్షలను ఖర్చు చేసి జాతి కుక్క కోలీ కాస్ట్యూమ్స్‌ను జెప్పెట్ సంస్థ 40 రోజుల వ్యవధిలో తయారు చేసింది. ఈ మేరకు టోకో ఈ కుక్కకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ధరించి అచ్చం కుక్కలా మారిపోయాడు. కుక్క మాదిరిగా హావాభావాలు ప్రదర్శించాడు. కుక్క మాదిరిగా నడిచేందుకు ప్రయత్నించాడు. కొందరు వీడియోలు తీసి వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చం కుక్కలా ఉన్న టోకో ఫొటోలు, వీడియోలు చూసి నెటిజన్‌లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Exit mobile version