NTV Telugu Site icon

Japan: జపాన్ విప్లమాత్మక ప్రయోగం.. ఆవు పేడతో స్సేస్ రాకెట్ ఇంజన్ సక్సెస్

Rocket Engaine With Cow Dun

Rocket Engaine With Cow Dun

జపాన్ శాస్త్రవేత్తలు విప్లమాత్మక ప్రయోగాన్ని ఆవిష్కరించారు. ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగించి విజయం సాధించారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయో మీథేన్‌తో జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ ఆవు పేడతో తయారు చేసిన ఇంధనంతో రాకెట్ భూమి నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి, సురక్షితంగా భూమిపైకి దిగింది. హెకైడో స్పేస్ పోర్టు లాంచ్ కాంప్లెక్స్ ఈ పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు.

Also Read: Congress Meeting: రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

జపాన్‌లోని ఇంజనీర్లు ఆవు పేడ నుండి సేకరించిన ద్రవ మీథేన్‌తో నడిచే కొత్త రాకెట్ ఇంజిన్‌ను ప్రయత్నించారు. జీరోగా పిలువబడే ఈ రాకెట్ ఇంజిన్ జపాన్‌లోని హక్కైడో స్పేస్‌పోర్ట్‌లో 10-సెకన్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్”లో కిక్‌స్టార్ట్ చేశారు. జీరో ఒక చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ బయోమీథేన్ లేదా ఎల్బీఎం ద్వారా శక్తిని తయారువుతుందని, ఇది పశువుల ఎరువు నుండి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యా ఉద్గారాతను తగ్గించవచ్చని, మారుమూల ప్రాంతాలలో ఇంధన సమస్యలను కూడా పరిష్కరిస్తుందని జపాన్ సంస్థ పేర్కొంది. కాగా అంతరిక్ష యాత్రకు ఇంధనం చాలా ముఖ్యమైనదనే విషయం తెలిసిందే. ప్రస్తుత స్పేస్ రాకెట్స్‌‌లో ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్‌‌ను ఇంధనాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఇంధనాలు చాలా శక్తివంతమైన గ్యాస్‌తో తయారవుతుంది.

Also Read: Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీకొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?

దీని ఉత్పత్తి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మరోవైపు దీని నుంచి వచ్చే పొగ పర్యావరణానికి హానికరం. ఈ సమస్యను పరిష్కరించేందుకు జపాన్‌కు చెందిన వీస్‌పేస్ సంస్థ ఆవు పేడను అంతరిక్ష రాకెట్‌లకు ఇంధనంగా ఉపయోగించేలా పరిశోధన జరిపింది. ఆవు పేడను ఒక రకమైన బయోఫ్యూయల్‌గా మార్చి ఇంధనంగా మారుస్తారు. ఈ బయోఫ్యూయల్‌ను “ఆవు పేడ హైడ్రోజన్” అని పిలుస్తారు. ఆవు పేడ హైడ్రోజన్ అనేది ఒకలాంటి గ్యాస్. ఇది ద్రవ హైడ్రోజన్ కంటే తక్కువ శక్తివంతమైనది, అలాగే తక్కువ ఖర్చుతో దీనికి తయారు చేయవచ్చు. దీని వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదని ఆ సంస్థ పేర్కొంది. తాజాగా ఈ ఆవు పేడతో తయారు చేసిన ఇంధనాన్ని స్పేస్ రాకెట్ ఇంజన్‌తో ప్రయోగించారు జపాన్ శాస్త్రవేత్త. ఈ ఇంధనంతో రాకెట్ భూమి నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి, సురక్షితంగా భూమిపైకి దిగింది.