Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత నమోదు

  • జపాన్‌లో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత నమోదు
  • హోన్షు ద్వీప తీరంలో భూకంపం
Earthquake

Earthquake

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అత్యధిక జనాభా కలిగిన హోన్షు ద్వీప తీరంలో ఈ భూకంపం సంభవించింది.

జపాన్‌లోని అతిపెద్ద ద్వీపమైన హోన్షు తూర్పు తీరానికి దూరంగా గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ల) లోతులో సంభవించిందని పేర్కొంది.

అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. జపాన్‌లో అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. తాజా భూకంపం కూడా పెద్ద ఎత్తునే సంభవించింది. అయితే దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం