జపాన్, చైనాలను భారీ భూకంపం కుదిపేసింది. జపాన్‌లోని హోన్షు ద్వీపంలో 6.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అలాగే చైనాలోని ఉత్తర క్వింగ్‌హై ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రెండు దేశాల్లోనూ భవనాలు కంపించడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగనట్టుగా తెలుస్తోంది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భూగర్భ కార్యకలాపాలు అకస్మాత్తుగా తీవ్రమవ్వడంతో రెండు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. జపాన్‌లోని హోన్షు ద్వీపం తూర్పు తీరంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మొదటి ప్రధాన భూకంపం సంభవించింది. దీని తర్వాత చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకారం.. చైనాలోని క్వింగ్‌హై ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో చాలా బలమైన భూకంపం నమోదైందని నివేదికలు వచ్చాయి. ఈ వరుస భూకంపాల నేపథ్యంలో రెండు దేశాల్లోని విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్ట అంచనాలు కొనసాగుతున్నాయి.

