Sumo Wrestlers: “సుమో రెజ్లర్” బరువు ధాటికి మరో విమానాన్ని ఏర్పాటు చేసిన జపాన్ ఏయిర్‌లైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumo Wrestlers: సాధారణంగా విమానాలు తన సామర్థ్యానికి సరిపడే బరువుతో మాత్రమే ఎగరగలవు. ఒక వేళ బరువు ఎక్కువైతే టేకాఫ్ సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో బరువు కారణంగా విమానాలు కుప్పకూలిన సంఘటనలు కూడా ఉన్నాయి. బరువు ఎక్కువైతే ప్రయాణికుల లగేజీని తగ్గించడమో, లేకపోతే వేరే సర్దుబాట్లు చేయటమో జరుగుతుంది.
ఇదిలా ఉంటే బరువు ధాటికి ఏకంగా జపాన్ ఎయిర్‌లైన్స్ ఏకంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అసలు అంత బరువు ఎలా వచ్చిందని అనునకుంటున్నారా..? సమో రెజర్లే అందుకు కారణంగా. జపాన్ మల్లయోధులు సుమో రెజ్లర్ల గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. భారీ కాయం కలిగిన వీళ్లు ప్రపంచంలోనే ఎక్కువ బరువు ఉండే రెజ్లర్లుగా ముద్రపడ్డారు. అయితే వీరి బరువు ధాటికి విమానం టెకాప్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
జపాన్ రాజధాని టోక్యో , ఒసాకా నుంచి అమామి ద్వీపంలో జరిగే ఓ జాతీయ క్రీడా టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లేందుకు విమానం ఎక్కిన సుమో రెజ్లర్ల బరువు కారణంగా విమానం టేకాఫ్ కావడానికి ఇబ్బంది కావచ్చని తేలడంతో చేసేదేం లేక మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఒక్కో రెజ్లర్ బరువు 120 కిలోలు ఉండటంతో వేరే విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సీఎన్ఎన్ తెలిపింది.
మొత్తం 27 మంది అథెట్లలో రెండు గ్రూపులు అక్టోబర్ 12న ప్రత్యేక విమనాల్లో బయలుదేరాల్సి ఉంది. ఒకటి టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టు నుంచి, రెండోడి ఒసాకలోని ఇటామి ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలి. అయితే రెండోడి చిన్న డొమెస్టిక్ విమానాశ్రయం. అయితే రెజ్లర్ల బరువు దాదాపుగా 120 కిలోలు ఉండటంతో పాటు రెండు బోయింగ్ 737-800 విమానాలు ఒక్కోక్కటి 165 మంది ప్రయాణికులతో పాటు బరువుకు తగ్గట్లుగా ఇంధనాన్ని మోసుకెళ్లలేవని విమానయాన సంస్థ ఆందోళన చెందింది.
సాధారణంగా విమాన ప్రయాణికుల సగటు బరువు 70 కిలోలుగా లెక్కిస్తారు. దీనికితోడు పెద్ద విమానాలు అమామి ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడానికి, టేకాఫ్ కావడానికి సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 14 మంది ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ప్రయాణికులు ముందుగా ఒసాకా నుంచి టోక్యో వెళ్లాల్సి వచ్చింది. విమాన బరువు పరిమితుల కారణంగా ప్రత్యేకంగా మరో విమానాన్ని నడపడం అసాధారణమైందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..