Site icon NTV Telugu

James Webb Telescope: విశ్వంలో అద్భుతం.. “పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్” చిత్రాలను తీసిన జేమ్స్ వెబ్

Pillars Of Creation

Pillars Of Creation

James Webb Telescope Captures The Iconic “Pillars Of Creation”: నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అద్భుతాలను సృష్టిస్తోంది. సుదూర విశ్వంలోని అద్భుత దృశ్యాలను సంగ్రహిస్తోంది. విశ్వం పుట్టుకకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తీసుకువస్తోంది. ఇప్పటి అనంత విశ్వానికి సంబంధించిన చిత్రాలను భూమికి పంపించింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. తాజాగా విశ్వంలోని ‘‘ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’’ చిత్రాలను తీసింది. విశ్వంలో నిటారుగా ఉన్న స్తంభాల వంటి ఈ నిర్మాణాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో 1995లోనే హబుల్ టెలిస్కోప్ కూడా పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ కు సంబంధించిన చిత్రాలను తీసింది. ఆ తరువాత 2014లో మరోసారి హబుల్ దీన్ని చిత్రీకరించింది. అయితే గతంలో హబుల్ టెలిస్కోప్ తీసిన వాటి కన్నా మరింత స్పష్టంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ చిత్రాలను క్యాప్చర్ చేసింది.

Read Also: Gym Trainer : హార్ట్ ఎటాక్ తో కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన జిమ్ ట్రైనర్

దాదాపు కొన్ని కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఉంది. భూమి నుంచి 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఈగిల్ నెబ్యూలాలో ఇది ఉంది. విశ్వంలోని ధూళి, గ్యాస్, పదార్థంతో ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఏర్పడింది. ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ నుంచే కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నట్లు గతంలో శాస్త్రవేత్తలు తేల్చారు. నక్షత్రాల పుట్టుకకు ఇదే కారణంగా ఉందని తెలిపారు. ఇందులోని ధూళి, వాయువులు గురుత్వాకర్షణ శక్తితో కొత్త నక్షత్రాలుగా ఏర్పడుతున్న విధానాన్ని జేమ్స్ వెబ్ తీసిన చిత్రాల్లో చూడవచ్చు.

దీనికి ముందు జేమ్స్ వెబ్ బబుల్ ర్యాప్, బబుల్ నెబ్యూలా చిత్రాలను తీసింది. కాస్మిక్ బబుల్ ర్యాప్, కాసియోపియా రాశిలో భూమికి 7,100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. బబుల్ నెబ్యూల విశ్వంలో అత్యంత ప్రసిద్ధ నెబ్యులాల్లో ఒకటి.

Exit mobile version