America Mega Lottery: అదృష్టవంతున్ని ఎవరు ఆపలేరు.. దురదృష్ట వంతున్ని ఎవరు బాగుచేయలేరని అంటారు. అంటే దురదృష్టవంతున్ని ఎంత బాగు చేద్దామన్న అతనికున్న దురదృష్టం బాగుపడకుండా అడ్డుకుంటుందని.. అలాగే అదృష్టవంతున్ని ఎంత దిగజారుద్దామనుకున్నా.. అతనికున్న అదృష్టం అతన్ని ముందుకే తీసుకెళ్తుంది. అదృష్టంతో కొందరు కోటీశ్వరులైతే.. దురదృష్టంతో కోటీశ్వరులు, లక్షాధికారులు బికారులుగా మారుతారు. ఈ మధ్య కాలంలో లాటరీల్లో కోట్లాది రూపాయలను గెలుచుకుంటున్న వారిని చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో కేరళలో పారిశుధ్య కార్మికులకు కోట్లాది రూపాయల లాటరీ దక్కింది. అంతకంటే ముందే ఒక వలస కూలీకి కోటి రూపాయల లాటరీ దక్కింది. అలాంటి లాటరీనే అమెరికాలో ఒక వ్యక్తికి దక్కింది. ఇతనికి లాటరీలో దక్కిన అమౌంట్ ఎంతో తెలుసా.. ఏకంగా రూ. 13వేల కోట్ల లాటరీని సొంతం చేసుకున్నాడు. అదృష్టం అంటే ఇదేనని అంటున్నారు.
Read also: North Korea: యుద్ధానికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. సైనిక జనరల్‌గా కొత్త వ్యక్తి నియామకం
అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద మూడో ప్రైజ్ మనీ అందించే లాటరీని మంగళవారం డ్రా తీశారు. అయితే ఇందులో ఫ్లొరిడాకు చెందిన వ్యక్తికి 1.58 బిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. మెగా మిలియన్స్ గా పిలిచే ఈ లాటరీలో 13, 19, 20, 32, 33, 14 నెంబర్లు ఉన్న టికెట్లకు అదృష్టం వరించింది. వీరందరికీ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ రానుంది. అయితే 1.58 బిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అతడిని గుర్తింపును ఇంకా ఆ సంస్థ వెల్లడించలేదు. ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని గెలుచుకున్నప్పటికీ.. అతడికి ఒకే సారి ఈ డబ్బులు అందవు. వీటిని అతడికి 30 ఏళ్ల పాటు ప్రతీ ఏడాది కొంత మొత్తంగా అందజేస్తారు. ఒకేసారి కావాలంటే కూడా అందిస్తారు… కాకపోతే దానికి ఒక కండీషన్ అమలు చేస్తారు.. అదేంటంటే లాటరీలో వచ్చినదాంట్లో సగం మాత్రమే ఇస్తారు. దాదాపుగా 783.3 మిలియన్ డాలర్లే అందజేస్తారు. ఇది భారత కరెన్సీలో అయితే రూ.6,488 కోట్లు అన్నమాట. ఇంత పెద్దమొత్తాన్ని లాటరీలో సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరనే దానికోసం అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
