Site icon NTV Telugu

Italy: చైనాకు ఇటలీ బిగ్ షాక్.. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) నుంచి ఔట్..

China, Italy

China, Italy

Italy: చైనా తన వ్యాపార విస్తరణ, తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) ప్రాజెక్టును మొదలుపెట్టింది. అయితే కోవిడ్ పరిణామాలు, చైనాపై అపనమ్మకం, ఈ ప్రాజెక్టుపై భాగస్వామ్య దేశాల అనుమానాలు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి కీలక దేశం ఇటలీ వైదొలుగుతున్నట్లు అధికారికంగా చైనాకు తెలియజేసింది. ప్రతిష్టాత్మక చైనా ప్రాజెక్టుపై సందేహాలకు నేటితో తెరపడింది.

Read Also: KCR: మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్తులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు

2019లో ఇటలీ బీఆర్ఐ ప్రాజెక్టులో చేరిన ఏకైక వెస్ట్రన్ దేశంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనాకు సున్నితమైన సాంకేతికత, కీలకమైన మౌలిక సదుపాయాలపై నియంత్రణ పొందే వీలుంటుందని అమెరికా నుంచి వచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ ఈ ప్రాజెక్టులో భాగమైంది. అయితే, గతేడాది ఇటలీలో జార్జియా మెలోని అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాను, వెస్ట్రన్ దేశాలతో అనుసంధానించే ఈ ఒప్పందం నుంచి విరమించుకోవాలని ఆమె కోరింది. ఈ ప్రాజెక్టు ఇటలీకి పెద్దగా లాభాలు తీసుకురాలేదని ఆమె పేర్కొంది. 2019 ఒప్పందం మార్చి 2024లో ముగుస్తోంది. దీని నుంచి ఉపసంహరించుకున్నట్లు ఇటలీ కనీస మూడు నెలల ముందు రాతపూర్వక వార్నింగ్ ఇవ్వకపోతే ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.

దీంతో ఇటలీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని చైనా ప్రభుత్వానికి తెలియజేస్తూ.. ఇటీవల బీజింగ్‌కి లేఖ అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇకపై మేము బీఆర్ఐలో భాగం కానప్పటికీ.. చైనాతో అద్భుతమైన సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశం మాకు ఉందని ఇటలీ చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇతర జీ-7 దేశాలు చైనాతో ఇటలీ కన్నా ఎక్కువ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది, అయినప్పటికీ అవి బీఆర్ఐలో భాగంగా లేవని ప్రభుత్వం వెల్లడించింది. 2024లో ఇటలీ జీ7 అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది.

Exit mobile version