NTV Telugu Site icon

Israel: ఇరాన్ అధ్యక్షుడి మరణంలో మా ప్రమేయం లేదు..

Raisi

Raisi

Israel: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆదివారం మరణించాడు. ఈ ప్రమాదం తర్వాత చాలా మంది ఇందులో ఇజ్రాయిల్ గూఢాచర సంస్థ ‘మొస్సాద్’ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే కాకుండా ఇరాన్ వ్యాప్తంగా రైసీ మరణంలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉండొచ్చని ప్రజలు చెబుతున్నారు. అంతరిక్ష నుంచి లేజర్ ద్వారా హెలికాప్టర్‌ని కూల్చేశారనే రకరకతా థియరీలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. వాతావరణం బాగా లేకపోవడమే అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడానికి కారణమని ప్రాథమికంగా అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయిల్ ప్రటించింది. ఆదివారం నాటి హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ మరియు మరో ఆరుగురు ప్రయాణికులు మరియు సిబ్బంది మరణించిన ఘటనలో మొసాద్ ప్రమేయం ఉందన్న వాదనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

Read Also: Live-In Partner: లివ్-ఇన్ పార్ట్‌నర్‌ని సోదరుడి సాయంతో చంపేసిన మహిళ..

ఇప్పటికే గాజా యుద్ధం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. నెల రోజుల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్, ఆ దేశానికి చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారుల్ని హతమార్చింది. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయిల్‌పై క్షిపణులతో దాడి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి మరణంతో అన్ని వేళ్లు ఇజ్రాయిల్ వైపు చూపిస్తున్నాయి.

ఆదివారం ఇరాన్, అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని కొండల్లో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. అతని కోసం ఇరాన్ యంత్రాంగం వెతికిన ఒక రోజు తర్వాత సోమవారం అతను మరణించాడనే వార్తను వెల్లడించింది. మరోవైపు రైసీని ఉద్దేశిస్తూ అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘అని చేతులు రక్తంతో నిండిపోయాయి’’ అని వైట్ హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ విలేకరులతో అన్నారు. ప్రస్తుతం మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ మొఖ్బర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కూడా ప్రారంభించారు.