Donald Trump: రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నిక ర్యాలీలో పాల్గొన్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ తుపాకీతో ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్లింది. స్వల్పగాయాలు అయ్యాయి. వెంటనే తేరుకున్న సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌కి రక్షణగా నిలిచారు. దాడికి పాల్పడిన నిందితుడిని కాల్చి చంపారు.
Read Also: Chandipura virus: గుజరాత్‌లో ‘‘చండీపురా వైరస్’’ కలకలం.. నలుగురు పిల్లలు మృతి..
ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడిపై తొలిసారి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడేందుకు దేవుడు సాయం చేశాడని ట్రంప్ ఆదివారం అన్నారు. అమెరికన్లు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ‘‘ అనుకోలేని ఘటనను జరకుండా దేవుడు మాత్రమే నిరోధించాడు.’’ అని యూఎస్ మాజీ అధ్యక్షుడు అన్నాడు. ‘‘చెడు గెలవకుండా తోటి అమెరికన్లు ఏకం కావాలని’’ ట్రంప్ పిలుపునిచ్చారు.
‘‘ ఈ తరుణంలో, మనం ఐక్యంగా నిలబడటం అమెరికన్లుగా మన నిజమైన పాత్రను చూపించడం, దృఢంగా ఉండీ చెడును గెలవడానికి అనుమతించకుండా ఉండటం చాలా ముఖ్యం’’ అని ఆదివారం ఉదయం ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫారంలో రాశారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో సోమవారం ప్రారంభమయ్యే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు హాజరవుతానని చెప్పారు.