NTV Telugu Site icon

Israel-Lebanon War: 200 మంది హిజ్బులా ఉగ్రవాదుల హతం.. ఐడీఎఫ్ వెల్లడి

Idf

Idf

హిజ్బుల్లా ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు సాగిస్తోంది. ఈ వారం జరిగించిన దాడుల్లో 200 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 140 రాకెట్ లాంఛర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం పేర్కొంది. మరణించిన వారిలో సీనియర్ హిజ్బుల్లా నాయకులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో బెటాలియన్ ఆపరేషన్స్ ఆఫీసర్, రద్వాన్ ఫోర్స్‌లోని బెటాలియన్ యాంటీ ట్యాంక్ ఆఫీసర్ ఉన్నట్లు పేర్కొంది. గురువారం లెబనాన్‌లోని బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతంలోని దహియేహ్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భవనాల మధ్య భారీ ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.

ఇది కూడా చదవండి: Health: ఈ డ్రింక్స్ తాగుతున్నారా..? కాలేయానికి ఎఫెక్ట్

గత 20 సంవత్సరాలుగా హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ డజన్ల కొద్దీ ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసిందని.. పాలక కోట అయిన దహీహ్ జిల్లా నడిబొడ్డున నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేసిందని ఐడీఎఫ్ తెలిపింది. నివాస భవనాల క్రింద క్రమపద్ధతిలో నిల్వ ఉంచారని.. వందల కొద్దీ క్షిపణులు తయారు చేసి నిల్వ ఉంచినట్లు సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్‌కు హానీ కలిగించేందుకే ఈ క్షిపణులు ఉంచినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి బందీలుగా తీసుకుపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగలిపోతుంది. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు మద్దతు ఇచ్చిన హిజ్బుల్లాను కూడా అంతం చేస్తోంది. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా అగ్ర నాయకులను ఇజ్రాయెల్ సైన్యం హతం చేసింది.

ఇది కూడా చదవండి: Robinhood : నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్.. అంచనాలు పెంచేలా టీజర్