Site icon NTV Telugu

Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 38 మంది మృతి

Israelgaza

Israelgaza

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని.. చాలా మంది శిథిలాల్లో చిక్కుకున్నారని వైద్యులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు కానీ.. అయినా పౌరులకు నష్టం జరిగింది. ఇక ప్రత్యేక దాడుల్లో మరో తొమ్మిది మంది మరణించారని.. మొత్తానికి బుధవారం నాటి మరణాల సంఖ్య 38కి చేరుకున్నట్లు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Delhi: ఆ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్ బైకులు, సీఎన్‌జీ ఆటోలు బ్యాన్..?

సీనియర్ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ అతని పేరు వెల్లడించలేదు. పౌరులకు హాని కలగకుండా.. ముందుగా అనేక చర్యలు తీసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఎన్‌క్లేవ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మరో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు కూడా నిర్ధారించారు. బుధవారం మరణాల సంఖ్య 38కి పెరిగినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే గత వారమే షెజైయాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. అయినా ఖాళీ చేయలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిశాక.. గత మూడు వారాల్లో 1,500 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Donald Trump: సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాకు మాత్రం భారీ షాక్..

Exit mobile version