Site icon NTV Telugu

Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..

Israel Palestine Conflict

Israel Palestine Conflict

Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. సదరు వ్యక్తి రిజర్వ్ సైనికుడని, అతడిని మిలిటరీ సర్వీస్‌ను రద్దు చేసినట్లు చెప్పింది. సదరు వ్యక్తి తన అధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించేలా వ్యవహరించినందుకు అతడి ఆయుధాన్ని జప్తు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.

Read Also: Emmanuel Love: గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. అమ్మాయి ఎవరంటే..?

వీడియో ఫుటేజీలో ఇజ్రాయిల్ వ్యక్తి తన వాహనంతో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టడం చూడవచ్చు. ఆ తర్వాత, సైనికుడు అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సైగ చేయడం కనిపిస్తుంది. ఈ ఘటనలో పాలస్తీనా వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. పాలస్తీనా వ్యక్తి తండ్రి మజ్డీ అబు మోఖో మాట్లాడుతూ.. తన కొడుకు కాళ్లలో నొప్పి ఉండని చెబుతున్నాడని, ఇజ్రాయిలీ సైనికుడు తన కొడుకుపై పెప్పర్ స్ప్రే చల్లాడని కూడా ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి ఒక సెటిలర్ అని, ఇతర సెటిలర్లతో వచ్చి, తమని రెచ్చగొడుతున్నాడని చెప్పాడు.

Exit mobile version