గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం వేళ ఒక ఇజ్రాయెలీయుడు విషాదకరమైన నిర్ణయానికి తీసుకున్నాడు. ఇటీవలే రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తైంది. ప్రస్తుతం శాంతి ఒప్పందం జరిగింది. ఇలాంటి తరుణంలో ఒక ప్రియుడు మరణశాసనాన్ని రాస్తున్నాడు. హమాస్ చేతిలో చనిపోయిన ప్రియురాలిని జ్ఞాపకం చేసుకుని తాజాగా రోయ్ షాలెవ్ అనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతి ఒప్పందం వేళ ప్రాణాలు తీసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Suresh Gopi: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తిరిగి సినిమాలు చేసుకుంటా.. సురేష్ గోపి సంచలన ప్రకటన
2025, అక్టోబర్ 7న గాజా-ఇజ్రాయెల్ యుద్ధం జరిగి రెండేళ్లు పూర్తైంది. కొద్దిరోజులకే రోయ్ షాలెవ్ (30) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో కీలక పోస్ట్ పెట్టాడు. తన ప్రియురాలు లేని జీవితాన్ని ముందుకు సాగించలేనని పేర్కొన్నాడు. అక్టోబర్ 10న రోయ్ షాలెవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తం అయ్యేలోపే ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Hamas-Israel: నేడు బందీల విడుదల.. ఇజ్రాయెల్‌కు ట్రంప్.. యుద్ధం ముగిసిందని ప్రకటన
‘‘దయచేసి నాపై కోపం తెచ్చుకోకండి. ఎవరూ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకోలేనందున అది పర్వాలేదు. ఈ బాధ అంతం కావాలని నేను కోరుకుంటున్నాను. నేను బతికే ఉన్నాను. కానీ లోపల ప్రతిదీ చచ్చిపోయింది.’’ అని రోయ్ షాలెవ్ రాశాడు. కొన్ని గంటల తర్వాత టెల్ అవీవ్‌లో కాలిపోతున్న కారులో చనిపోయి కనిపించాడు. ఇంధనం పోసి సజీవదహనం అయినట్టుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Cricket Tragedy: చివరి బంతి వేశాడు, మ్యాచ్ గెలిపించాడు.. కానీ మైదానంలోనే మరణించాడు!
రాయ్ షాలెవ్-మాపాల్ ఆడమ్ ప్రేమికులు. 2023 అక్టోబర్ 7న నోవా ఓపెన్-ఎయిర్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఊహించని రీతిలో హమాస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మాపాల్ ఆడమ్ ప్రాణాలు కోల్పోయింది. రాయ్ షాలెవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అప్పటి నుంచి ఆమె ధాన్యంలో మునిగిపోయాడు. ఇక చేసేదేమీలేక అక్టోబర్ 10న నిప్పుంటించుకుని సజీవదహనం అయ్యాడు. మాపాల్ ఆడమ్ సోదరి మాయన్ శనివారం రాయ్ షాలెవ్ ఫోటోను పోస్ట్ చేసింది. రాయ్ చనిపోయినట్లు పేర్కొంది. తనకు మాటలు రావడం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే సోమవారం ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. రెండేళ్ల తర్వాత విముక్తి లభిస్తోంది.
