Site icon NTV Telugu

Hamas-Israel: ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం.. రెండేళ్ల తర్వాత బందీల విడుదల

Iseael2

Iseael2

ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. టెల్ అవీవ్‌లో భారీ హర్షధ్వానాలు వినబడుతున్నాయి. పెద్ద ఎత్తున థ్యాంక్స్ ట్రంప్ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది ఇజ్రాయెలీయులు రోడ్లపైకి వచ్చి ఆనంద భాష్పాలు కురిపిస్తున్నారు. తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసిందని ఐడీఎఫ్ తెలిపింది.

ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో సోమవారం మూడు విడతల్లో బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడత బందీలను రెడ్‌క్రాస్ బృందానికి హమాస్ అప్పగించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హర్షధ్వానాలు వినబడుతున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. మరికొద్దిసేపట్లో బందీల కుటుంబాలతో ట్రంప్ భేటీ కానున్నారు.

 

Exit mobile version