Site icon NTV Telugu

Israel video released: వామ్మో.. ఈ వీడియో చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో..!

Israel Video Released

Israel Video Released

గతేడాది అక్టోబర్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టింది. చివరికి అదే నెల వచ్చేటప్పటికీ ఇప్పుడు గురి హిజ్బుల్లా మీదకు మళ్లింది. గత వారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసింది. పేజర్లు, వాకీటాకీలను పేల్చి వందలాది మంది ప్రాణాలు తీసింది. ఇక ఈ వారం ప్రారంభంలోనే సోమవారం 600 రాకెట్లు ప్రయోగించింది. దాదాపు 557 మంది చనిపోయారు. ఇంకా దాడులు కొనసాగిస్తోంది. ఇక తాజాగా దాడులను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో అన్నట్టుగా ఉంది. లెబనాన్‌పై చేస్తున్న దాడుల తీరును వివరిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్‌ (IDF) ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. యుద్ధ విమానాలతో స్థావరాలను ధ్వంసం చేస్తున్న తీరు కనిపించింది. ‘‘ మీరు ఈ వీడియో చూడాలని గానీ, షేర్‌ చేయాలని గానీ హెజ్బుల్లా కోరుకోదు’’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Israel-Lebanon: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విధ్వంసం.. కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ హతం..!

హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ రాకెట్ దాడులు చేస్తోంది. హిజ్బుల్లా నేతలు.. పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. నివాస సముదాయాల్లో భారీగా ఆయుధాలు దాచిపెట్టినట్లుగా ఆరోపిస్తోంది. దక్షిణ లెబనాన్ అడ్డగా హిజ్బుల్లా కార్యకలాపాలను విస్తరించినట్లుగా కనిపెట్టింది. అందుకే హిజ్బుల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది.

https://twitter.com/IDF/status/1839251492655571063

Exit mobile version