NTV Telugu Site icon

Israel: రెండో దశకు మీరు సిద్ధమా..? సైనికులతో ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు.. పెద్దగా ప్లాన్ చేస్తోంది..

Israel Pm

Israel Pm

Israel: ఇజ్రాయిల్ ఢిపెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజాలోని హమాస్ పై ప్రతీకార దాడులు చేస్తోంది. గత శనివారం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడిని చేశాయి. ఆ దాడిలో 1300 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువరిని బందీలుగా చేసుకున్న హమాస్ ఉగ్రవాదులు వారిని గాజాలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ వైమానికి దళం గాజా స్ట్రిప్ పై నిప్పుల వర్షాన్ని కురిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ రోజు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఇజ్రాయిల్ సైనికులను కలిశారు. ఇజ్రాయిల్ పదాతిదళ సిబ్బందితో మాట్లాడారు. ‘‘మీరు తదుపరి దశకు సిద్ధంగా ఉన్నారా..? తదుపరి దశ వస్తోంది’’ అని వారితో చెబుతున్న వీడియోను పీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇప్పటికే గాజాను దిగ్భందించిన ఇజ్రాయిల్ ఆ ప్రాంతానికి నీటిని, కరెంట్, ఇంధనాన్ని కట్ చేసింది. గాజాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని 24 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు, దక్షిణ వైపు వెళ్లాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వలస వెళ్తున్నారు. ఈ టైమ్ దగ్గర పడిన సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని నుంచి ఈ మాటలు వచ్చాయి.

Read Also: Bandi Sanjay: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ గురించి బండి సంజయ్ ఏమన్నారో తెలుసా..!

హమాస్ తీవ్రవాదుల వద్ద ఉన్న బందీలను రెస్క్యూ చేయడంతో పాటు హమాస్ ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ చేయబోతోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇజ్రాయిల్ ఇచ్చిన 24 గంటల సమయాన్ని మరో 6 గంటలు పొడగించింది. గాజాలో చిక్కుకుపోయిన విదేశీయులు, ఇతర ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు డెడ్ లైన్ పొడగించింది.

గాజాలోని ఉన్న ప్రజల్ని హమాస్ ఉగ్రవాదులు మానవ కవచాలుగా వాడుకుంటుందనే అభిప్రాయాని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇందుకే అక్కడి నుంచి వెళ్లాలని సూచించింది. మరోవైపు ఈ హెచ్చరికలతో మానవత సంక్షోభం ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే ఈ యుద్ధంలో మరణాల సంఖ్య 3000లను దాటింది.