NTV Telugu Site icon

Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..

Yeman

Yeman

Houthis- Israel: పాలస్తీనాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాపై దాడుల తర్వాత తాజాగా యెమెన్‌లో హౌతీ మిలిటెంట్లే టార్గె్ట్ గా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. ఆదివారం భీకర దాడులు చేసింది. హౌతీ తిరుగుబాటుదారుల లక్ష్యాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. యుద్ధ విమానాలు, పవర్ ప్లాంట్లు, ఒక నౌకాశ్రయాన్ని పూర్తిగా నాశనం చేసింది. రాస్ ఇస్సా‌లోని హోడెయిడా పోర్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.

Read Also: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు

అలాగే, మా భద్రతా బలగాలకు ఏ ప్రదేశం కూడా ఎక్కువ దూరంలో లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తెలిపారు. దాడి జరిపిన హుడెయిడా పోర్టు హౌతీ మిలిటెంట్లకు చాలా కీలకమైంది. చమురు దిగుమతి కోసం ఈ నౌకాశ్రయాన్ని వినియోగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉండడంతో వల్లే ఈ పోర్ట్ ద్వారానే ఇరాన్ ఆయుధాలను ఇక్కడికి చేరవేస్తున్నారు ఆయన చెప్పుకొచ్చారు. చమురు రవాణాతో పాటు సైనిక అవసరాల కోసం దీనినే హౌతీలు వాడుకుంటున్నారు. అందుకే దీనిపై దాడి చేసినట్టు ఐడీఎఫ్ పేర్కొనింది.

Read Also: Niharika Konidela : 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు హౌతీలు చనిపోగా.. 29 మంది గాయపడ్డారని యెయెన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలకు ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది. ఇరాన్ మద్దతు ఉన్న ఈ మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే తాజాగా యెమెన్‌లోని హౌతీల లక్ష్యాలపై దాడులు చేస్తోంది.

Show comments