Site icon NTV Telugu

Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి: యూఎన్ ఏజెన్సీ..

Israel Iran War

Israel Iran War

Israel Iran War: ఇరాన్ అత్యంత రహస్యమైన, సురక్షిత ‘‘నటాంజ్’’ అణు సముదాయంపై ఇజ్రాయిల్ ఖచ్చితమైన దాడిని నిర్వహించినట్లు తెలుస్తోంది. భూగర్భం లోతులో ఎంతో సురక్షితమైన ఈ స్థావరాన్ని ఇజ్రాయిల్ విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) మంగళవారం చెప్పింది. నటాంజ్ యూరేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్ ఈ దాడిలో ధ్వంసమైనట్లు వెల్లడించింది.

Read Also: Gang Rape: బీచ్‌లో ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..10 మంది అరెస్ట్

ఇరాన్ అణు కార్యక్రమాలను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో నటాంజ్ లోని భూగర్భ అణు స్థావరాలపై దాడులు జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. వీటిని IAEA ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ అయిన IAEA, ఇప్పటికీ పరిస్థితి అంచనా వేస్తున్నట్లు, నటాంజ్ సదుపాయాన్ని పరోక్షంగా మాత్రమే దాడి చేసినట్లు సూచించింది.

Exit mobile version