NTV Telugu Site icon

Israel–Hamas: హమాస్‌ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్..

Hamas

Hamas

Israel–Hamas war: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్‌ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌12 న్యూస్‌ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్‌ బలగాలకు సిన్వార్‌ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిన్వార్‌ తన చుట్టూ బందీలను కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఎన్‌12 కథనంలో ప్రచురించింది.

Read Also: RK Roja: సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..

ఇక, మరోవైపు హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లాపై దాడి జరిగిన విషయం తెలుసుకొన్న యహ్వా సిన్వార్‌ శనివారం గాజాలో మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సౌదీ అరేబియాకు చెందిన అల్‌ అరేబియా పత్రిక వెల్లడించింది. కాగా, గత వారం హమాస్‌ అధినేత సిన్వార్‌ మరణించినట్లు తీవ్రస్థాయిలో ప్రచారం కొనసాగింది. దీనిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్‌) బలగాలు ఇంకా ధ్రువీకరించలేదు. ఆదివారం ఇజ్రాయెల్‌ సైనిక దళాలు ఓ కీలక మీటింగ్ కొనసాగింది. దీంట్లో ఇప్పటి వరకు చనిపోయిన వారితో పాటు మిగిలిన మిలిటెంట్‌ సంస్థల కీలక నాయకుల ఫొటోలను వెనక స్క్రీన్‌లో ప్రదర్శనకు ఉంచింది. కానీ, యహ్యా సిన్వార్‌ చిత్రంపై మాత్రం క్వశ్చన్‌ మార్కును ఐడీఎఫ్ ఉంచింది. ఈ నేపథ్యంలో అతడు బ్రతికి ఉన్నాడా..? చనిపోయాడా అనే అంశంపై ఇంకా ఐడీఎఫ్‌ క్లారిటీ ఇవ్వలేదు.