మొస్సాద్.. ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థ. గురి పెట్టిందంటే పని కావాల్సిందే. అంత పగడ్బందీగా పని చేయగల సామర్థ్యం మొస్సాద్ సొంతం. అలాంటిది మొట్టమొదటిసారిగా ఖతార్‌లో విఫలమైంది. దీనికి అంతర్గత విభేదాలే కారణంగా ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Extramarital Affair: అక్రమ సంబంధం వద్దన్నందుకు.. ఆమెతో పాటు తల్లిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
ఈనెల 9న ఖతార్‌లో హమాస్ నాయకులంతా సమావేశమైనట్లు మొస్సాద్‌కు పక్కా సమాచారం అందింది. హమాస్ చీఫ్ ఖలీల్ అల్-హయ్యాతో సహా ఉన్నతాధికారులంతా భేటీ అయినట్లు సమాచారం తెలిసింది. అయితే ఈ సమాచారం మొస్సాద్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అందింది. అయితే ఎటాక్ చేసేయాలని నెతన్యాహు ఆదేశాలు ఇచ్చేశారు. కానీ మొస్సాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నియా మాత్రం భయపడ్డారు. కారణం ఏంటంటే.. బందీల విడుదల కోసం ఈ మధ్య అమెరికా సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా ఖతార్‌తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ ఖతార్ కూడా వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో ఖతార్‌లో ఎటాక్ చేస్తే అమెరికాకు ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని డేవిడ్ బర్నియా సంకోచించారు. ఖతార్‌పై దాడికి ఏ మాత్రం మొగ్గుచూపలేదు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం
కానీ ఓ వైపు నెతన్యాహు మాత్రం తీవ్రంగా పట్టుబట్టారు. దాడి చేయాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఇలాంటి తర్జనభర్జన మధ్యే 15 జెట్‌లు, 10 క్షిపణులను దోహా వైపు దూసుకెళ్లాయి. హమాస్ నాయకులు సమావేశమైన నివాసాల మధ్య పడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఆశ్చర్యంగా హమాస్ నాయకులంతా తప్పించుకున్నారు. కానీ వారి బంధువులు, సహాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఒక ఖతార్ అధికారి కూడా మరణించారు.
అయితే ఈ దాడులు మొస్సాద్-నెతన్యాహు మధ్య విభేదాలు తీసుకొచ్చిందని ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అలాగే ఐడీఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఖతార్‌పై దాడి చేస్తే బందీల విడుదల చర్చలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సూచించారు. కానీ నెతన్యాహునే లెక్కచేయలేదని సమాచారం. వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటామని మొండిగా వాదించినట్లు తెలుస్తోంది. చివరికి నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జా, వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి రాన్ డెర్మెర్ మద్దతుతో ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. ఓ ఇజ్రాయెల్ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించింది.
ఈ దాడి తర్వాత పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్రంగా ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక ఈ దాడిని ఖతార్ కూడా తీవ్రంగా పరిగణించింది. ‘స్టేట్ టెర్రరిజం’గా అభివర్ణించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియకు ద్రోహం చేసిందని ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ అల్ థాని పేర్కొన్నారు. అయితే రక్తపాతాన్ని ఆపడానికి మాత్రం మా దౌత్యం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇక ఈ దాడిని ట్రంప్ కూడా ఖండించారు. ఈ దాడి వెనుక తన పాత్ర లేదని స్పష్టం చేశారు. నెతన్యాహు ఆదేశాలతోనే జరిగిందని పేర్కొన్నారు.
