NTV Telugu Site icon

భయపెడుతున్న హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు… 

ఇజ్రాయెల్‌-గాజా మ‌ద్య గత 8 రోజులుగా యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  గాజాప‌ట్టి నుంచి హ‌మాస్ ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో దాడులు చేస్తుంటే,  ఇజ్రాయెల్ గాజాప‌ట్టిలోని ఉగ్ర‌వాదుల‌ను, ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేస్తున్న‌ది.   గాజాప‌ట్టిలో హ‌మాస్ ఉగ్ర‌వాదులు 2011 నుంచి దాదాపుగా 1500ల‌కు పైగా సొరంగాల‌ను నిర్మించింది.  దీనికోసం సుమారుగా 1.26 బిలియ‌న్ డాల‌ర్లు ఖర్చు చేసిన‌ట్టు గ‌ణాంకాలు చెప్తున్నాయి.  160 యుద్ద విమానాలు చేసిన దాడుల్లో 150కి పైగా సొరంగాలు ద్వంసం అయ్యాయి.  గాజాప‌ట్టి నుంచి ఈజిప్ట్ వ‌ర‌కు స్మ‌గ్లింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున సొరంగాలను నిర్మించారు.  అదే విధంగా గాజాప‌ట్టి నుంచి ఇజ్రాయెల్ వ‌ర‌కు చిన్నవి ఇరుకుగా ఉండే సొరంగాల‌ను నిర్మించారు.  ఈ సొరంగాల ద్వారా ఉగ్ర‌వాదులు ఇజ్రాయెల్ లోకి ప్ర‌వేశించి అక్క‌డి వ్య‌క్తుల‌ను, ఆర్మి సిబ్బందిని కిడ్నాప్ చేస్తుంటారు.  ఉగ్ర‌వాదులు ఇజ్రాయెల్ లోకి ప్ర‌వేశించి అనేక మందిని హ‌త‌మార్చిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి.  ఉగ్ర‌వాదులు నిర్మించిన సొరంగాల‌ను ద్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ స‌రికొత్త టెక్నాల‌జీని డేవ‌ల‌ప్ చేసింది.  ఈ టెక్నాల‌జీతోనే 150 సొరంగాల‌ను ద్వంసం చేసింది.