Site icon NTV Telugu

Israel Strikes Iran: ఇరాన్ సైనిక లక్ష్యాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ దాడి..

Iran

Iran

Israel Strikes Iran: ఇరాన్‌లో నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు స్టార్ట్ చేసింది. ఈరోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి ఈ మేరకు దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్ తమ దేశంపై దాడికి యత్నించిందని.. దానికి ప్రతీకారంగా ఈ దాడులు మొదలు పెట్టినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్‌ ప్రభుత్వం కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసిన దాడులకు ప్రతిస్పందనగా.. ప్రస్తుతం మా రక్షణ దళాలు ఆ దేశంలోని సైనిక లక్ష్యాలపై నిర్దిష్టమైన దాడులు నిర్వహిస్తున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది. ఇరాన్, దాని అనుకూల శక్తుల నుంచి ఎదురవుతున్న దాడులకు తిప్పి కొట్టే హక్కు, బాధ్యత తమకు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

Read Also: Off The Record : ఆ BRS లీడర్స్ భయపడుతున్నారా.? వాళ్ళను వెంటాడుతున్న భయమేంటి.?

ఇక, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్‌‌తో దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. తమ రక్షణ, ఇతర సామర్థ్యాలు సంపూర్ణంగా సమీకరించుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి పరిధి తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టు పక్కల బలమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా కథనాలు ప్రసారం చేసింది. సమీపంలోని కరాజ్ నగరంలో కూడా పేలుళ్లు వినిపించాయని చెప్పుకొచ్చింది. కాగా అక్టోబరు 1వ తేదీన ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ 200లకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటిలో దాదాపు అన్నింటిని ఇజ్రాయెల్ బలగాలు గగన తలంలోనే కూల్చివేసింది. ఆరు నెలల వ్యవధిలోనే ఇరాన్ చేసిన రెండవ ప్రత్యక్ష దాడిగా ఇజ్రాయెల్ పేర్కొనింది. అందుకే ప్రతీకార దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.

Exit mobile version