ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ మరోసారి విధ్వంసం సృష్టించింది. కిర్కుక్ సమీపంలోని చెక్‌పోస్ట్ దగ్గర దాడికి దిగింది. ఈదాడిలో పదమూడు మంది పోలీసులు మరణించారు.ఐఎస్ఐఎస్ దాడులతో ఇరాక్ అతలాకుతలమవుతోంది. ఇరాకీ పోలీసులే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో.. పదముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ ఉత్తరభాగంలోని కిర్కుక్ నగర సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద .. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడికి దిగింది. రెండు చోట్ల దాడులు చేశారు ఉగ్రవాదులు. అర్థరాత్రి సమయంలో దాడి జరిగినట్లు సీనియర్ ఇరాకీ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ ఉగ్రముఠాలు.. ఇరాక్ పోలీసులు, ఆర్మీ లక్ష్యంగా దాడులు చేస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి జరిగిన దాడి .. ఈసంవత్సరంలోనే అత్యంత భీకరమైందిగా అధికార వర్గాలు చెబుతున్నాయి. స్లీపర్ సెల్స్‌గా ఉంటూ, సమయం వచ్చినప్పుడు దాడులకు దిగుతున్నట్లు అనుమానిస్తున్నాయి.
ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు :13 మంది పోలీసుల మృతి
