NTV Telugu Site icon

Iris Ibrahim: ఆమెకి 83, అతనికి 37.. పెళ్లైన రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్

Iris Ibrahim Love Story

Iris Ibrahim Love Story

Iris Jones And Mohammad Ibrahim Took Divorce After 2 Years Of Marriage: సాధారణంగా పెళ్లి చేసుకునే వరుడు, వధువు మధ్య వయసు వ్యత్యాసం ఎంతుంటుంది? 1 నుంచి 5 సంవత్సరాలు అనేది యావరేజ్ వ్యత్యాసం. కొందరు పదేళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ.. ఎలాంటి అభ్యంతరం లేకుండా పెళ్లి చేసుకుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రియాంక, నిక్ జోనస్ జంటే! కానీ.. 46 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న జంటని మీరెప్పుడైనా చూశారా? మీకు నమ్మశక్యంగా లేకపోయినా.. అలాంటి జంట ఒకటుంది. ఇదే పెద్ద షాకింగ్ న్యూస్ అనుకుంటే, తాజాగా ఈ జంట అంతకుమించిన మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లైన రెండేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Jailer vs Jailer: రజనీకాంత్ జైలర్‌కి పోటీగా మరో జైలర్.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?

2019లో ఐరిస్ జోన్స్ అనే 83 ఏళ్ల బ్రిటీష్ మహిళకు ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లో 37 ఏళ్ల మహ్మద్ ఇబ్రహీమ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్‌బుక్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం.. కొన్ని రోజుల్లోనే స్నేహంగానే మారింది. ఇబ్రహీంపై తనకు ఫీలింగ్స్ రావడంతో.. 2019 నవంబర్‌లో ఐరిస్ ఈజిప్ట్ రాజధాని కైరోకి వచ్చింది. అక్కడే ఇబ్రహీంని కలిసింది. ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులు కావడంతో.. ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ నగరంలో హనీమూన్ కూడా జరుపుకున్నారు. వీళ్లు తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు.. నెట్టింట్లో టాక్ ఆఫ్ ది కపుల్‌గా నిలిచారు. ఎందుకంటే.. వీరి మధ్య ఉన్న 46 ఏళ్ల వయసు వ్యత్యాసమే కారణం. పైగా వీళ్లు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటూ.. నిత్యం వార్తల్లో నిలిచేవారు.

Karumuri Nageswara Rao: పెళ్ళికి, పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్.. మంత్రి కారుమూరి ధ్వజం

ఐరిస్, ఇబ్రహీంల దాంపత్య జీవితం రెండేళ్ల వరకు సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ షాకింగ్ విషయాన్ని ఐరిస్ తాజాగా పంచుకుంది. తనకు ఇబ్రహీం అంటే చాలా ఇష్టమని, అతనికి సంబంధించి ప్రతీదీ తాను ఇష్టపడతానని పేర్కొంది. కానీ.. కొంతకాలం నుంచి తమ బంధం కష్టంగా మారిందని.. తాము ప్రేమలో ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో.. విడిపోవడమే మంచిదని భావించి, తాము విడాకులు తీసుకున్నామని కుండబద్దలు కొట్టింది. ఈ బాధ నుంచి కోలుకోవడం కోసం తాను పిల్లిని పెంచుకుంటున్నానని చెప్పింది. తాను మొదటి భర్తతో 1993లో విడాకులు తీసుకున్నానని.. 26 ఏళ్లుగా అతనితో టచ్‌లో లేనని కూడా వెల్లడించింది.

Show comments