Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర
- ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఖాసిం సులేమానీ హతమయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్న ఒక ఉగ్రవాది, ఇవాంకా ట్రంప్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు అమెరికా భద్రతా సంస్థలు వెల్లడించాయి.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, అరెస్టు చేయబడిన వ్యక్తి ఇరాక్‌కు చెందిన 32 ఏళ్ల మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీగా గుర్తించారు. అతడు ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ Qasem Soleimani మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు సమాచారం. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఖాసిం సులేమానీ హతమయ్యాడు. ఆ ఆపరేషన్‌కు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవాలని అల్-సాదీ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
భద్రతా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇవాంకా ట్రంప్ ఫ్లోరిడాలోని విలాసవంతమైన నివాసానికి సంబంధించిన బ్లూప్రింట్లు, భద్రతా వివరాలు సేకరించాడు. కొంతకాలంగా ఆమె ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ కేసుపై మాజీ ఇరాకీ మిలిటరీ అధికారి ఆంటిఫాద్ కన్బార్ స్పందిస్తూ, “ఖాసిం సులేమానీ మరణం తర్వాత అల్-సాదీ తీవ్ర ఆగ్రహంతో ఉండేవాడు. ట్రంప్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని బహిరంగంగానే మాట్లాడేవాడు” అని వెల్లడించారు.
అమెరికా భద్రతా సంస్థలు ప్రస్తుతం ఈ కుట్ర వెనుక ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కుటుంబ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?