Site icon NTV Telugu

Iran: ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఇరాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా చీఫ్ హత్యపై నిరసన..

Iran

Iran

Iran: లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ హతం చేసింది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన దాడుల్లో అతను చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని పెంచింది. హిజ్బుల్లాకు బలమైన మద్దతుదారుగా ఉన్న ఇరాన్, ఈ హత్యని ఖండించింది. ఇరాన్ వ్యాప్తంగా నస్రల్లా మరణానికి నిరసన తెలుపుతూ వేలాది మంది ప్రజలు రోడ్డు పైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లో భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి చేరారు. ఇజ్రాయిల్‌పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇరానియన్లు శనివారం డిమాండ్ చేశారు.

Read Also: Israel-Lebanon Tention: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ జనరల్ మృతి..

టెహ్రాన్‌లోని పాలస్తీనా స్వ్కేర్‌లో శుక్రవారం రాత్రి నిరసనలు ప్రారంభమయ్యాయి.”రివెంజ్,” “డౌన్ విత్ ఇజ్రాయెల్” , “డౌన్ విత్ ది యుఎస్” అంటూ నినాదాలు చేశారు. నిరసన సమయంలో కొంత మంది గన్స్ కూడా చేతపట్టారు. నిరసనాకారులు పాలస్తీనా, హిజ్బుల్లా జెండాలను ఊపుతూ, నస్రల్లా ఫోటోలతో ప్రదర్శన చేశారు. ఇజ్రాయిల్, అమెరికా జెండాలను కాల్చి వేశారు. పాలస్తీనాలో జియోనిస్ట్ పాలన, అనాగరిక నేరాలను ఖండించడానికి పౌరులు వీధుల్లోకి రావాలని ఇరాన్ అధికారులు పిలుపునిచ్చారు.

సెమ్నాన్, కోమ్, కషన్, కెర్మాన్‌షా, షిరాజ్ మరియు బందర్ అబ్బాస్‌తో సహా ఇరాన్ నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. హౌతీ తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న యెమెన్‌లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ముస్లింలకు పక్షాన నిలవాలని, ఇజ్రాయిల్‌ని ఎదుర్కోవాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు పిలుపునిచ్చారు.

Exit mobile version