Site icon NTV Telugu

nti hijab protests: ఇరాన్‌లో భారీ నిరసనలు.. మాజీ సుప్రీం లీడర్ పూర్వీకుల ఇంటికి నిప్పు

Iran Protsts

Iran Protsts

Iranian protesters set fire to former supreme leader Ayatollah Khomeini’s ancestral home: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. హిజాబ్ సరిగా ధరించలేదన చెబుతూ మోరాలిటీ పోలీసులు మహ్స అమిని అనే యువతిని చంపేయడంతో ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ నిరసనల్లో 300 మందికి పైగా చనిపోయినట్లు పలు ఇంటర్నేషనల్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నిరసనకారులు రెచ్చిపోయారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ పూర్వీకుల ఇళ్లకు నిప్పటించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు ఖొమేనీ స్వస్థలంలో ఓ మ్యూజియంలో మంటలు కనిపిస్తున్నాయి. నిరసనకారులు ఇంటికి నిప్పు పెట్టినట్లు వస్తున్న వార్తలను ఇరాన్ మీడియా ఖండించింది. ఇంటికి మంటలు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Kim’s daughter: కిమ్ కూతురు ఎలా ఉందో చూశారా..? ప్రపంచానికి తొలిసారిగా కూతురి పరిచయం

1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి అయతుల్లా ఖొమేని నాయకత్వం వహించారు. ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించేందుకు 1979లో ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చారు. దేశంలో పెద్ద మతగురువు అయ్యారు. గురువారం సాయంత్రం రాజధాని టెహ్రాన్ కు దక్షిణాన ఉన్న ఖొమేనీ స్వస్థలంలో ఆయన ఇంటిని తగలబెట్టారు నిరసనకారులు.

22 ఏళ్ల మహ్స అమిని మరణించిన తర్వాత హిజాబ్ వ్యతిరేక అల్లర్ల ఇరాన్ దేశంలో పెరుగుతున్నాయి. అక్కడి సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. మతధికారులు పాలనకు ముగింపు పలకాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అల్లర్లతో ప్రస్తుతం అయతొల్లా ఖొమేనీ వారసుడిగా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర ఒత్తడిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని టెహ్రాన్ తో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

Exit mobile version