Site icon NTV Telugu

Iran-Israel War: ఇరాన్‌లో భారీ నష్టం.. మిలటరీ చీఫ్ సహా అగ్ర నేతలంతా మృతి

Mohammad Bagheri

Mohammad Bagheri

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్‌లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి కూడా మరణించారు. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మేజర్‌ జనరల్‌ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది. అంతేకాకుండా ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది.

ఇది కూడా చదవండి: Iran-Israel War: భారత్ అప్రమత్తం.. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచన

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ముఖ్యనేతలంతా చనిపోయినట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి: PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ

ఇక బాఘేరి టెహ్రాన్‌లో జన్మించారు. 2016 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఇది దేశంలో అత్యున్నత సైనిక పదవి. మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో నిపుణుడు. 1980లో ఐఆర్‌జీసీలో చేరి ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో పోరాడారు. పొలిటికల్‌ జియోగ్రఫీలో ఆయన పీహెచ్‌డీ చేశారు. జనరల్ స్టాఫ్‌లో ఇంటెలిజెన్స్ మరియు ఆపరేషన్ల కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న బాఘేరి జూన్ 28, 2016న సాయుధ దళాల జనరల్ స్టాఫ్ (AFGS) కొత్త ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఇరవై ఏడు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న హసన్ ఫిరోజబాది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇక బాఘేరి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి.

Exit mobile version