Site icon NTV Telugu

Iran Russia Meeting: యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. రేపు రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి!

Iran

Iran

Iran Russia Meeting: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల చేసింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విదేశాంగ విధానానికి అమెరికా తూట్లు పొడిచింది అని పేర్కొన్నారు. తమపై చేసిన దాడులకు యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది అన్నారు. అలాగే, టెల్అవీవ్ పై భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతున్నామని అబ్బాస్ అరఘ్చి వెల్లడించారు.

Read Also: Hyderabad: ఆర్మీ కాలేజీలో చొరబడ్డ ఆగంతకులు.. టెర్రరిజం కోణంపై స్పష్టత ఇచ్చిన డీసీపీ..!

ఇక, ఇందులో భాగంగానే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఉంది. ఈ సందర్భంగా రేపు ( జూన్ 23న) మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కాబోతున్నాను అని ఎక్స్ వేదికగా టెహ్రాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. ఇరాన్- రష్యా మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం అన్నారు. అలాగే, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బలప్రయోగాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ఖండించారు. ఈ సంఘర్షణను తగ్గించడానికి మాస్కో సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. మరోవైపు, ఇరాన్ లోని అణు స్థావరాలపై అమెరికా దాడులను చైనా కూడా తీవ్రంగా ఖండించింది. ఈ విధంగా దాడులకు పాల్పడటం మంచిది కాదని సూచించింది.

Exit mobile version