Site icon NTV Telugu

Iran-Israel War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఖమేనీ అత్యంత సన్నిహితుడు మృతి

Iransuprem Leaderkhamenei

Iransuprem Leaderkhamenei

ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు.. ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ , ఇరానియన్ సాయుధ దళాలు రెండింటికీ నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇది కూడా చదవండి: Russia-Ukrain: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 14 మంది మృతి

మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో షాద్మానీ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. ఇక షాద్మానీ మరణవార్తపై ఇంకా ఇరాన్ స్పందించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: TheRajaSaab : రెబల్ స్టార్ ‘రాజాసాబ్’ టీజర్.. రికార్డ్ మిలియన్ వ్యూస్

తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు పుట్టిస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక కెనడాలో జీ 7 సదస్సులో ఉన్న ట్రంప్ హుటాహుటిన అమెరికాకు వెళ్లిపోయారు. తక్షణమే భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక జీ 7 దేశాలు.. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశాయి.

ఇది కూడా చదవండి: Bharat Petrol: ఎంతకు తెగించార్రా.. ఉప్పల్ లో భారత్ పెట్రోల్ పంపు ఘరానా మోసం.. మిషన్ లో సెట్టింగ్ పెట్టి..

Exit mobile version