ఇరాన్‌లో రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు 50 వేలకు పైగా నమోదవుతుండటం అందోళన కలిగిస్తోంది. ఇక ఇరాన్‌లో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన టీకాలను నమ్మడంలేదు. ఆ రెండు దేశాలు తయారు చేసిన టీకాలు నమ్మదగినవి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతుండటంతో ఇరాన్ లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నది. వ్యాక్సిన్ లను బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. అస్త్రాజెనకా వ్యాక్సిన్ ధర బ్లాక్‌లో 90 వేలకు పైగా పలుకుతున్నది. బ్లాక్‌లో ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, ప్రజలు వాటిని కొనుగోలు చేయడం కోసం పోటీపడుతున్నారు. మొత్తం 8.5 కోట్ల మంది జనాభా కలిగిన ఇరాన్‌లో కేవలం 35 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ అందించారు. ఇరాన్ ప్రజలు సొంత వ్యాక్సిన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇరాన్‌లో వ్యాక్సిన్ సంక్షోభం… బ్లాక్‌లో భారీ ధరలకు…
