Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా భారీ స్థాయిలో నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తు్న్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడింది. యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, ఖతార్‌లోని యూఎస్ బేసులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించిన దాని కన్నా విధ్వంసం మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వీటి మరమ్మతులకు బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా.
Read Also: Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ గల్ఫ్ లోని ఏడు దేశాల్లోని ముఖ్యమైన స్థావరాలపై దాడులు చేసింది. వీటిలో ఆయుధ గిడ్డంగులు, ఆపరేషన్ కమాండ్ సెంటర్లు, విమాన హ్యాంగర్లు, శాటిలైట్ వ్యవస్థలు నాశనమయ్యాయి. రన్ వే, రాడార్ వ్యవస్థల్ని దెబ్బతీసింది. అమెరికా శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థల్ని ఇరాన్ ఛేదించి దాడులు చేసింది.
అయితే, ఎంత నష్టపోయామనే వివరాలను యూఎస్ రక్షణ శాఖ ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు ఇరాన్‌పై ట్రంప్ చేస్తున్న యుద్ధానికి యూఎస్ కాంగ్రెస్ నుంచి 200 బిలియన్ డాలర్లకు పైగా కోరుతున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే యూఎస్ తన సైనిక కార్యకలాపాల కోసం 11 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. యుద్ధం ప్రారంభ కావడానికి ముందు ట్రంప్ 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ కోరారు. ఇది గతేడాది కన్నా 50 శాతం అధికం.
