Site icon NTV Telugu

Iran: ఉరిశిక్షలతో అణచివేత.. 26 ఏళ్ల నిరసనకారుడికి ఇరాన్ మరణశిక్ష..

Iran

Iran

Iran: దేశ వ్యాప్తంగా చెలరేగుతున్నఆందోళనల్ని ఇరాన్ అణచివేయాలని చూస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వందలాది మంది ఇప్పటికే మరణించారు. అయితే, ఈ నిరసనలతో సంబంధం ఉన్నవారిని అక్కడి ప్రభుత్వ కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. తాజాగా, మొదటి ఉరిశిక్షను అమలు చేయాడానికరి ఇరాన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు చేయనున్నారు.

Read Also: Iran protests: “అమెరికన్లు వెంటనే ఇరాన్‌ను వదిలేయండి”.. దాడికి సిద్ధమైన యూఎస్..!

టెహ్రాన్‌లోని కరాజ్ శివారులోని ఫర్డిస్ నివాసి సోల్తానీని జనవరి 8న జనవరి ప్రారంభం నుండి ఇరాన్ అంతటా వ్యాపించిన అయతుల్లా అలీ ఖమేనీ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నందుకు అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, సొల్తానీకి బుధవారం శిక్ష విధించనున్నారు. గతంలో కూడా ఇరాన్ అసమ్మతిని అణిచివేయడానికి ఉరిశిక్షను ఒక సాధానంగా వాడుకుంది. ప్రస్తుతం చెలరేగుతున్న ఆందోళల్లో మొదటి ఉరిశిక్ష సొల్తానీదే. మరణశిక్షలు విధించడం ద్వారా ఉద్యమకారుల్ని భయపెట్టాలని ఖమేనీ సర్కార్ భావిస్తోంది.

అరెస్టయినప్పటి నుంచి సొల్తానీకి న్యాయవాదిని సంప్రదించే హక్కు, తన వాదనల్ని వినిపించే హక్కులు నిరాకరించబడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. అతడిని అరెస్ట్ చేసినప్పటి నుంచి అధికారులు అతడి కుటుంబానికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. జనవరి 11న సొల్తానీకి మరణశిక్ష విధించబడిందని అతడి కుటుంబానికి తెలియజేశారు. శిక్ష గురించి తెలిసిన తర్వాత, కేవలం 10 నిమిషాలు మాత్రమే కుటుంబానికి కలిసే అనుమతి ఇచ్చారని తెలిసింది.

Exit mobile version