Site icon NTV Telugu

Israel-Iran War: ఇజ్రాయెల్ నిప్పుల వర్షం.. బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

Iran War

Iran War

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకర దాడులు మొదలు పెట్టింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అగ్ర కమాండర్లు సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇక 200లకు పైగా సామాన్య పౌరులు కూడా చనిపోయారు. ప్రస్తుతం ఇరు పక్షాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఇక ఇరాన్‌పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లో కీలక ప్రాంతాలు ధ్వంసం కావడంతో.. ముందస్తు జాగ్రత్తగా ఖమేనీని అధికారులు సురక్షితంగా ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అండర్‌గ్రౌండ్‌లో కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ayesha Khan : చీరలో నాజూకైన ఒంపు సొంపులతో అదరగొడుతున్నఆయేషా ఖాన్

ఖమేనీ లక్ష్యంగా ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఖమేనీ ఉన్న ప్రాంతంలోనే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఆదివారం కూడా ఈ ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. ఖమేనీ సురక్షితంగా లేరని భావించిన అధికారులు.. లావిజాన్‌లోని బంకర్‌లోకి తరలించారు.

ఇది కూడా చదవండి: Sekhar Kammula : ‘కుబేర’ పైనే డిస్ట్రిబ్యూటర్ల ఆశలన్ని..

గత 4 రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్‌లో మరణాల సంఖ్య పెరిగింది. 230 మంది చనిపోయారు. ఇందులు 90 శాతం మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 మంది చనిపోయారు. ఇందులో పిల్లలు అన్నారు. ఇక ఇరాన్‌లో అగ్ర కమాండర్లు సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.

Exit mobile version