Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
- ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం
- ఇరాన్ కొత్త శపథం
- యుద్ధంతో నైపుణ్యం నేర్చుకున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నంతకాలం అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక అధికారి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ సలహాదారు మహ్మద్ రెజా నక్ది సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై పోరాడటం ఎలా అన్నది తమకు ఇప్పటికే తెలిసిపోయిందని.. యుద్ధంలో విజయం తమవైపే ఉందని పేర్కొన్నారు. అమెరికాపై దీర్ఘకాలిక ఒత్తిడి పెంచడం ద్వారా భవిష్యత్తులో ఇరాన్‌పై దాడి చేయాలనుకునే ఏ దేశమైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే భయాన్ని కలిగించడమే తమ లక్ష్యమని తెలిపారు.
పీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నక్ది మాట్లాడుతూ.. ఇరాన్‌కు శాశ్వత భద్రత కల్పించేందుకు నిరోధక శక్తి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా యుద్ధాన్ని తదుపరి అమెరికా అధ్యక్ష పదవీకాలం వరకు కొనసాగించి, అమెరికాపై ఒత్తిడి పెంచడం ఒక మార్గమని పేర్కొన్నారు. ‘‘శత్రువు ఎప్పుడూ మాపై దాడి చేయడానికి సాహసించకుండా నిరోధక శక్తిని సాధించాలి. ఒక మార్గం ఏమిటంటే.. తదుపరి అధ్యక్ష పదవీకాలం వచ్చే వరకు ఈ యుద్ధాన్ని కొనసాగించి, అమెరికాపై నష్టాన్ని పెంచడం. భవిష్యత్తులో ఎవరైనా ఇరాన్‌పై దాడి చేయాలనుకుంటే దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వారికి తెలిసేలా చేయాలి’’ అని నక్ది వ్యాఖ్యానించారు.
Also Read
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
2019 నుంచి 2025 వరకు ఐఆర్జీసీ సమన్వయ డిప్యూటీగా పనిచేసిన నక్ది.. ప్రస్తుతం ఆ దళాల కమాండర్‌కు సీనియర్ సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఘర్షణపై తమ సైనిక నాయకత్వంలోని కొంతమంది అభిప్రాయాలను ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. యుద్ధం ప్రస్తుతం ఎవరి నియంత్రణలో ఉందన్న ప్రశ్నకు నక్ది.. ‘‘కచ్చితంగా విజయం మా వైపే ఉంది’’ అని సమాధానమిచ్చారు. అమెరికా స్పష్టమైన వ్యూహం లేకుండానే యుద్ధం చేస్తోందని ఆరోపించారు. వాషింగ్టన్ తన లక్ష్యాలను పదేపదే మార్చుకుంటోందని విమర్శించారు.
ఖార్గ్ ద్వీపంపై దాడి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాలను అమెరికా తన లక్ష్యాలుగా పేర్కొంటోందని నక్ది అన్నారు. ‘‘ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే మాకు అంత అనుభవం వస్తుంది. అమెరికాతో నిజమైన యుద్ధం చేయడం ద్వారా ఎలా పోరాడాలో నేర్చుకునే అవకాశం ఇంతకుముందు మాకు లేదు. గత ఐదు నెలల్లో అది నేర్చుకున్నాం. అమెరికా సైన్యం మనం ఊహించిన దానికంటే బలహీనంగా ఉందని కూడా చూశాం’’ అని పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ ఘర్షణలో హార్ముజ్ జలసంధి కీలక కేంద్రంగా మారింది. వ్యూహాత్మకమైన ఈ జలమార్గంపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు. షిప్పింగ్‌కు ఇరాన్ మరింత అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే హార్ముజ్ మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణ స్థాయితో పోలిస్తే భారీగా తగ్గిపోయాయి. రాయిటర్స్ పేర్కొన్న తాజా షిప్పింగ్ డేటా ప్రకారం.. మంగళవారం కేవలం 8 నౌకలు మాత్రమే హార్ముజ్ జలసంధిని దాటాయి. యుద్ధానికి ముందు రోజుకు సగటున 130 నుంచి 140 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం 11 నౌకల రాకపోకలు నమోదయ్యాయి. హార్ముజ్‌ను తిరిగి తెరవాలంటే అమెరికా నుంచి పలు రాయితీలు పొందాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి అంశాలను ఇరాన్ ప్రస్తావిస్తోంది.
ఇరాన్ క్షిపణి సామర్థ్యాలపై కూడా నక్ది కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రోజూ ప్రయోగించే క్షిపణుల కంటే ఎక్కువ క్షిపణులను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా యుద్ధం దీర్ఘకాలం కొనసాగినా క్షిపణి దాడులను కొనసాగించే సామర్థ్యం తమకు ఉందని సంకేతమిచ్చారు. ‘‘ఇరాన్ దగ్గర క్షిపణులు పూర్తిగా అయిపోయే రోజు వస్తే.. అదే అమెరికాకు మేము మరింత ప్రమాదకరంగా మారే రోజు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వేలాది ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నింటినీ సులభంగా ధ్వంసం చేయవచ్చు’’ అని నక్ది హెచ్చరించారు.
అయితే నక్ది చేసిన ఈ క్షిపణుల తయారీ, సామర్థ్యానికి సంబంధించిన వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించలేమని సమాచారం. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగించడం, తాత్కాలిక అవగాహనను పునరుద్ధరించడంపై కూడా ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణను పొడిగించే విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి గతంలో రాయిటర్స్‌కు తెలిపారు. అమెరికా తన బాధ్యతలను అమలు చేసేందుకు కాలపరిమితిని నిర్ణయించడం, అవగాహన ఒప్పందానికి తిరిగి రావడం వంటి అంశాలు చర్చలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిరిన 48 గంటల్లోనే ఉల్లంఘించిందని, కొద్ది రోజులకే దాని నుంచి వైదొలిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
కాల్పుల విరమణను పొడిగించే ప్రశ్నే లేదని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ‘‘ఇరాన్ దృష్టిలో కాల్పుల విరమణ ప్రారంభ తేదీనే లేదు. కాబట్టి దాన్ని పొడిగించే ప్రశ్నే లేదు’’ అని ఓ సీనియర్ ఇరాన్ అధికారి పేర్కొన్నారు. మరో ఇరాన్ అధికారి కూడా అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపుపై ఎలాంటి చర్చలు జరగడం లేదని వెల్లడించారు.
ట్రంప్ తదుపరి అధ్యక్ష పదవీకాలం వచ్చే వరకు యుద్ధాన్ని కొనసాగించవచ్చన్న నక్ది వ్యాఖ్యలు ఇప్పటికే అనిశ్చితంగా ఉన్న అమెరికా-ఇరాన్ ఘర్షణకు మరో కొత్త కోణాన్ని జోడించాయి. అమెరికాను దీర్ఘకాలికంగా అలసిపోయేలా చేయడం, యుద్ధ అనుభవాన్ని పెంచుకోవడం, తమ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం కోసం సుదీర్ఘ యుద్ధం ఒక మార్గంగా ఇరాన్ సైనిక వ్యవస్థలోని కొంత వర్గం భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
మరోవైపు హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న అంతరాయాలు, కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ తిరస్కరించడం, జలమార్గాన్ని తిరిగి తెరవడానికి ముందు అమెరికా నుంచి రాయితీలు కోరడం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఈ ఘర్షణకు తక్షణ ముగింపు కనిపించడం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
తాజావార్తలు
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?