Site icon NTV Telugu

Iran-US: అమెరికాపై ప్రతీకార దాడులకు ఇరాన్ రంగం సిద్ధం..! 48 గంటల్లో ఏదైనా జరగొచ్చు!

Israelusiran

Israelusiran

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఇంతలో అగ్ర రాజ్యం అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అమెరికాపై పగ తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 48 గంటల్లో ఏదైనా జరగొచ్చని నివేదికలు అందుతున్నాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: షాకింగ్‌..! ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు..

అమెరికాపై ఇరాన్‌ రాబోయే 48 గంటల్లో దాడులు చేయొచ్చని వార్తా సంస్థ రాయిటర్స్ కథనం తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా దళాలపై ప్రతీకార దాడులు చేయొచ్చని.. దీంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని పేర్కొంది. అయితే ఇంకోవైపు సంఘర్షణ మరింత ముదరకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కానీ ఒకటి లేదా రెండు రోజుల్లో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: VeriFast App: పాస్‌పోర్ట్ ప్రక్రియలో.. తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నెంబర్‌ 1

ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 40, 000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇందులో చాలా మంది వాయు రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు నిర్వహిస్తున్నారు. ఒక వేళ ఇరాన్ దాడి చేస్తే.. ధ్వంసమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఇరాన్.. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా అమెరికాపై భీకర దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని గంటల్లో ఏదొకటి జరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యమైన అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌లపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తాజాగా ఫోర్డ్‌లోని భూగర్భ అణు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది.

Exit mobile version