NTV Telugu Site icon

Israel-Iran: ఇజ్రాయెల్‌తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి

Israeliran

Israeliran

పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్‌గా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తోంది. శత్రువులతో చేతులు కలిపే దేశాలపై ఇజ్రాయెల్ దూకుడుగా పోతోంది. ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయా దేశాలు తమ పౌరులు లెబనాన్‌ను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చాయి.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!

తాజాగా ముస్లిం దేశాలకు ఇరాన్ కీలక విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలని సూచించింది. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్‌ నాసిర్జాదేహ్‌ మాట్లాడారు. ముస్లిం దేశాలు.. ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవాలని కోరింది. ఆ దేశ దౌత్యవేత్తలను బహిష్కరించాలని తెలిపింది. అలాగే నెతన్యాహు ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ముందు లొంగిపోవద్దని యెమెన్‌కు చెందిన హూతీ చీఫ్‌ అబ్దుల్ మాలిక్ కూడా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Amrapali Kata : గ్రేటర్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ GHMC కమిషనర్ నిర్ణయం

ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను గురువారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తిరస్కరించారు. లెబనాన్‌పై పూర్తిశక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హిజ్బుల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్‌ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడమే తమ లక్ష్యమని నెతన్యాహు తెలిపారు. హిజ్బుల్లా ఆయుధాలను ధ్వంసం చేసే వరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Tiger Robi: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. బంగ్లా అభిమానిపై దాడి..!