Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
- ముంచుకొస్తున్న ట్రంప్ డెడ్‌లైన్
- ట్రంప్ బెదిరింపులను లెక్కచేయని ఇరాన్
- ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
- రైల్లో ప్రయాణం చేయొద్దని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Story Board: ఇరాన్ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా తాజాగా ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవరూ రైళ్లను ఉపయోగించవద్దని.. అంతేకాకుండా రైల్వే లైన్ల సమీపానికి కూడా ఎవరూ వెళ్లొద్దని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఇరానీయుల భద్రత దృష్ట్యా రైళ్లను ఉపయోగించొద్దని కోరింది. ఇరాన్ అంతటా రైళ్లను ఉపయోగించడం గానీ, ప్రయాణించడం గానీ తక్షణం మానుకోవాలని సూచించింది. దయచేసి అర్థం చేసుకోవాలని… వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు ఎక్స్‌లో ఇజ్రాయెల్ సైన్యం కోరింది. పర్షియన్ భాషా ఖాతాలో ఇజ్రాయెల్ పోస్ట్ చేసినట్లుగా రాయిటర్స్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్
ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని ఆ దేశ మెహర్ వార్తా సంస్థతో పాటు షర్గ్, హమ్-మిహాన్ పత్రికలు తెలిపాయి. ఇరాన్‌లోని షిరాజ్‌లో పెట్రోకెమికల్ యూనిట్‌పై ఐడీఎఫ్ దాడి చేసింది. ‘‘ఈ ప్లాంట్ పేలుడు పదార్థాలు, బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి ప్రక్రియల్లో అదనపు సామగ్రిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థమైన నైట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి ఇరాన్ సాయుధ దళాలకు ఉపయోగపడుతుంది.’’ అని ఐడీఎఫ్ తెలిపింది.
צה"ל תקף בשיראז מתחם פטרוכימי נוסף – אחד המתחמים הבודדים שנותרו לייצור רכיבים כימיים חיוניים עבור חומרי נפץ וחומרים לטילים בליסטיים באיראן
חיל האוויר בהכוונת אמ"ן השלים אתמול מטס תקיפה נרחב במספר אזורים באיראן לעבר תשתיות מרכזיות של משטר הטרור האיראני.
במסגרת המטס צה"ל תקף… pic.twitter.com/KOwfkD2a5M
— צבא ההגנה לישראל (@idfonline) April 7, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!