Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
- ఇజ్రాయెల్‌పై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇరాన్
- అక్టోబర్ 7, 2023 దాడి కంటే విస్తృతంగా దాడి చేసేలా ప్రణాళిక?
- హిజ్బుల్లా, హమాస్, హౌతీలు, ఇరాక్–సిరియా మిలీషియాల సమన్వయం.
- ఒకేసారి పలు రంగాల్లో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel War: ఇజ్రాయిల్‌పై భారీ దాడికి ఇరాన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7, 2023లో హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడి కన్నా పెద్ద దాడిని చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ అంచనాలను ఉటంకిస్తూ జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడికి ఇరాన్ తన ప్రాక్సీలను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లెబనాన్ నుంచి హిబ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్ లోని హైతీలు, ఇరాన్-సిరియాల్లోని ఇరాన్ అనుకూల మిలీషియా ఇలా నాలుగు వైపుల నుంచి ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ ప్లాన్ చేసిందని నివేదిక చెబుతోంది. ఈ దాడి ద్వారా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఈ ప్రాక్సీలను ‘‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’’గా పిలుస్తుంది.
2023 అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్‌పై భారీ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మందిని చంపేసి, పలువురిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, ఈ దాడి సమయంలోనే ఇరాన్, దాని అనుకూల గ్రూపులు కూడా దాడి చేయాలని భావించినా, సమన్వయం లేకపోవడంతో ప్లాన్ విఫలమైనట్లు అమెరికా, ఇజ్రాయిల్ ఇంటెల్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. ఫలితంగా హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయిల్ వైపు పరిమిత దాడులకే పరిమితమైంది. అంతా అనుకున్నట్లు ఇజ్రాయిల్‌పై ఈ దాడి విజయవంతమైతే ఇరాన్, హిజ్బుల్లా ఇతర ప్రాంతీయ శక్తులు ఈ యుద్ధంలోకి వస్తాయని హమాస్ మాజీ నేత యాహ్యా సిన్వార్ భావించినట్లు గాజా నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా నివేదిక పేర్కొంది.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
గత దాడిలో జరిగిన సమన్వయ లోపాన్ని అధిగమించేందుకు ఇరాన్ ముందుగానే సమన్వయంతో కూడిన దాడి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.హిజ్బుల్లా, హమాస్, హౌతీలు ఇతర ఇరాన్ అనుకూల మిలీషియా వేరువేరుగా స్పందించడం కాకుండా ఒకేసారి దాడి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)లోని ఖుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్ మిలీషియాల కమాండర్లతో సమావేశాలు, కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహించినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధంలో దెబ్బతిన్న తమ సైనిక సామర్థ్యాలను తిరిగి పెంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!