Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయగా, టెహ్రాన్ సైతం మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మైసైళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ యుద్ధానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎన్టీవీ తెలుగు ఛానల్ నీ చూస్తునే ఉండండి..
లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎటాక్.. హిజ్బొల్లా దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం.. బీరూట్ లో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు.. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా సోమవారం ఇజ్రాయల్ పై హిజ్బొల్లా ఎటాక్.. నార్త్ ఇజ్రాయెల్ లోని హైఫా టార్గెట్ గా హిజ్బొల్లా తీవ్రవాదుల దాడి.. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయల్ దాడి..
ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం.. ఇరాన్ మిసైల్ సిస్టమ్స్ పూర్తిగా ధ్వంసం చేసే దాకా నిద్రపోను.. అంతర్జాతీయంగా మా వెనక చాలా దేశాలు ఉన్నాయి.. కొన్ని దేశాలు బహిరంగ మద్దతు ప్రకటించడం లేదంతే: ట్రంప్
గల్ఫ్లో అమెరికన్ మిత్ర దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం.. 40 మందికి పైగా అమెరికన్ సైనికులు మా దాడుల్లో మృతి.. గల్ఫ్ షిప్పింగ్ జరగకుండా చేస్తాం.. దుబాయ్లో బిజినెస్ను దెబ్బకొట్టిన ఇరాన్.. ఖతార్, కువైట్కు ఇరాన్ ఆర్థిక దెబ్బ.. ఇజ్రాయెల్ కళ్ళల్లో ఆనందం కోసమే అమెరికా దాడులు.. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ ను నాశనం చేశాం: ఇరాన్
ఇరాన్- దుబాయ్- ఒమన్ మధ్య హార్మూజ్ జలసంధి మూసివేత.. భారత తదితర దేశాలకు క్యూడాయిల్ సరఫరాల నిలిపివేత..
UAE నుంచి మొదలైన భారతీయుల తరలింపు.. అబుదాబి నుంచి ఢిల్లీ చేరిన ఎతిమాద్ ఎయిర్ లైన్స్.. 300 మంది భారతీయుల రాక.. ఇప్పటి వరకు నాలుగు విమానాల రాక.. రాత్రి, ముంబై, బెంగళూరు, కొచ్చిలో దిగిన విమానాలు.. మూడ్రోజుల విరామం తర్వాత విమాన సేవలు షురూ.. ఇరాన్ దాడితో మూడ్రోజుల క్రితం విమాన సర్వీసులు నిలిపివేత..
నాలుగో రోజుకు చేరిన యూఎస్, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో భయంకరమైన పరిస్థితులు.. డ్రోన్లు, మిసైల్స్ తో బాంబుల వర్షం
మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు.. గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ, విదేశాంగశాఖ.. ఆయా దేశాల ఎంబసీల ద్వారా సమాచారం అందిస్తున్న అధికారులు..
బెహ్రయిన్లో చెలరేగిన అల్లర్లు.. ఖమేనీ హత్యకు నిరసనగా రోడ్డెక్కిన షియా కమ్యూనిటీ.. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన షియాలు.. పెట్రోల్ బాంబులు విసురుతూ నిరసనలు.. నిరసన కారులపై బెహ్రయిన్ పోలీసుల లాఠీచార్జ్, కాల్పులు..
రియాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. దాడిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ కి గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, తయారీ కేంద్రాలను నాశనం చేస్తాం.. ఇరాన్ నావికదళాన్ని ఇప్పటికే నాశనం చేశాం: డొనాల్డ్ ట్రంప్
LNG ఉత్పత్తి నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిర్ణయం.. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉన్న ఖతార్ ఎనర్జీ.. యూరప్ లో 50 శాతం పెరిగిన గ్యాస్ ధరలు.. ఖతార్ ఉత్పత్తి నిలిపివేయడంతో పెరిగిన గ్యాస్ ధరలు..
లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. హిజ్బుల్లా బలమైన కోట దహీయా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్లా అల్-మనార్ టీవీ స్టేషన్ లక్ష్యంగా దాడులు.. ఇజ్రాయెల్ దాడులతో దహీయాలో భారీగా ఆస్తి నష్టం.. ఇజ్రాయెల్ దాడులని ఖండించిన లెబనాన్ ప్రధాని.. దేశం మరో భారీ యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి..
రియాద్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. రెండు డ్రోన్లతో దాడి, భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. దాడిపై స్పందించిన ట్రంప్.. ఇరాన్ కు గట్టి బుద్ధి చెబుతామని వార్నింగ్..