Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు
- హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత
- నౌకపై ఇరాన్ దాడులు
- ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొడిగించారు. కానీ హార్ముజ్‌పై దిగ్బంధం ఎత్తేయలేదు. దీంతో రెండు దేశాల మధ్య అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే హార్ముజ్‌లోని ఒక నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని యూకే తెలిపింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం
Also Read
హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను చట్టబద్ధంగా అమలు చేస్తున్నామని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన వారిపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ వాన్‌గార్డ్ టెక్ ప్రకారం.. దాడి జరిగిన నౌక లైబీరియా జెండాను ఎగురవేస్తోంది. అయితే హార్ముజ్‌లో ప్రయాణించడానికి అనుమతి ఉందని తెలిపింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ మాత్రం.. ఆ నౌక ఇరాన్ సాయుధ దళాల హెచ్చరికలను విస్మరించిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
ఇరాన్‌తో ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తుంది. అయితే గడువు ముగిసేలోపు శాంతి ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పదే పదే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంది. బెదిరిస్తే చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. కానీ విచిత్రంగా 24 గంటల ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అడగకుండానే పొడిగించడమేంటి? అని ప్రపంచ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!